calender_icon.png 28 November, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూములు కాపాడండి

27-11-2024 11:40:51 PM

తహసీల్దారును కోరిన దళితులు..

పటాన్ చెరు(విజయక్రాంతి): తమ భూములను కాపాడాలని జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ దళితులు తహసీల్దార్ ను కోరారు. ఈ మేరకు బుధవారం గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులతో కలిసి దళితులు తహసీల్దార్ బిక్షపతికి వినతిపత్రం అందజేశారు. గ్రామ శివారులోని సర్వేనెంబర్ 286 లో అసైన్డ్ భూముల్లో గతంలో క్వారీ, కంకర క్రషర్ ఏర్పాటు పనులు జరుగుతుండడంతో తాము న్యాయస్థానానికి వెళ్ళడంతో పనులు ఆగాయన్నారు. కొందరు వ్యక్తులు మహీ కన్ స్ట్రక్షన్ పేరుతో వచ్చి మళ్లీ క్వారీ, క్రషర్ పనులను చేపట్టారని అన్నారు.

మమ్మల్ని భయపెడుతూ మా భూముల్లో నుంచి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని తహసీల్దార్ కు తెలిపారు. జిన్నారం సీఐ, ఎస్ఐలను కలిసి ఇదే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశామన్నారు. దళితుల భూముల జోలికి ఎవరొచ్చినా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఏఐఎస్ఎస్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏర్పుల శ్రీనివాస్, ఎస్సీ ఆర్ పి ఎస్  తాలూకా కన్వీనర్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.