18-03-2025 12:19:29 AM
కొండపాక, మార్చి 17:సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద మాసాన్ పల్లి, బండారుపల్లి గ్రామ రైతుల వరి పొలాలకు సాగునీరు అందించాలని కోరారు. సిద్దిపేట మున్సిపాలిటీ నర్సాపూర్ 2వ వార్డు లొ రైస్ మిల్లు, పారాబైల్ రైస్ మిల్లు ల నుంచి వచ్చే దుమ్ము దూలి, చెడువాయువులు, పొగ, దుర్వసన రావటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
అమిల్లులను తొలగించాలని వార్డు ప్రజలు, మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరికి వినతిపత్రం అందించారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలలో దివ్యాంగుళాలను ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా దివ్యాంగులాల అసోసియేషన్ సభ్యులు కోరారు.
ఇల్లు లేని వారికి ఇల్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.