రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో మన పూర్వీకులు నిర్మించిన అపురూప, చారిత్రక కట్టడములు శిధిలావస్థకు చేరువలో వున్నా యి. అనేక కోటలు,బురుజులు కాల గమననంలో కూలి పోతున్నా యి. కరీంనగర్‌లోని ఎలగంధుల ఖిల్లా, ఖిలా వరంగలులో రాతి స్తంభాలు, రామప్ప, వేయి స్తంభాల గుడి ఇలా ఎన్నో అపురూప శిల్ప కళా సంపదలు భవిష్యత్ లో కనుమరుగు అవుతుందని భావ న కలుగుతుంది. బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించినచారిత్రక కట్టడాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జయశశీకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రం లోని కోటగుళ్లు ,జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలంలోని ఖిలాషాపూర్‌లో గల 420 సంవత్సరాల చరిత్ర ఉన్న కట్టడం కూలిపోవడం బాధాకరం. ఈ కట్టడాన్ని సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించారు. తక్షణమే ఈ కట్టడాన్ని ప్రభుత్వం పురావస్తు శాఖ పునర్నిర్మించాలి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చారిత్రాత్మక, సుందరమైన కట్టడాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఎంతగానో ఉంది.
కామిడి సతీశ్ రెడ్డి,జయశంకర్ భూపాలపల్లి జిల్లా.