అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 25: అక్రమార్కల చెరనుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డికి పిగ్లీపూర్ గ్రామస్తులు బుధవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. పిగ్లీపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 17/2 విస్తీర్ణంలో 62.10 ఎకరాల ప్రభుత్వ భూమి, 56 ఎకరాల సీ లింగ్ ల్యాండ్ మొత్తం కలి పి 119.10 ఎకరాలు ఉం దని..
ఈ భూమికి సం బంధించి గత ప్రభుత్వ హ యాంలో ధరణిలో రికార్డులను తారుమారు చేసి కొందరు రియల్టర్లు క బ్జాలకు పాల్పడినట్లు గ్రామ స్తులు ఆరోపించారు. సమ గ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించడంతో పాటు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు లు.. కోట ప్రభాకర్ రెడ్డి, మురళి, నవీన్, షబ్బీర్ అలీ, జంగయ్య, మోహన్ రెడ్డి, శ్రీహరి, ఆనంద్, జాకీర్, లక్ష్మణ్, ఏఎస్‌ఎమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.