17-12-2024 01:08:00 AM
డెమోను ఆసక్తిగా తిలకించిన రైతులు
వరంగల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): డ్రోన్ స్ప్రేయర్ల వాడకంతో రైతులకు సమయంతో పాటు ఖర్చు ఆదా అవుతుందని ఎనుమాముల మార్కెట్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల తెలిపారు. సోమవారం వరంగల్ పరిసర ప్రాంతాల్లో మన అగ్రిటెక్ సంస్థ ఆధ్వర్యంలో దక్ష కంపెనీకి సంబంధించిన డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. పలు మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. డ్రోన్ ద్వారా రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని చెప్పారు. అతి తక్కువ సమయంలోనూ సులువుగా పిచికారీ చేసే అవకాశం ఉండటంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డ్రోన్ కోసం పెట్టిన పెట్టుబడి కేవలం నెల రోజుల్లో తిరిగి వస్తుందన్నారు. మన అగ్రిటెక్ సీఈవో పాశికంటి రమేశ్ మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా తమ కంపెనీ పనిచేస్తుందన్నారు.