calender_icon.png 18 April, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానంతో చిన్నారుల ప్రాణాలను కాపాడాలి..

10-04-2025 05:02:30 PM

మెగా రక్తదాన శిబిరం అభినందనీయం..

సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషనల్ (ఐవిఎఫ్),అంబేద్కర్ యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి గురువారం కరపత్రాలను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా 20 వేల మంది తలసేమియా చిన్నారులు ఉండడం చాలా బాధాకరం అని, వారి ప్రాణాలను కాపాడడానికి యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. ఈ శిబిరానికి సహకరిస్తున్నా ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, సూపరిండెంట్ వంచ చంద్రసేన్ రెడ్డి, డాక్టర్ దేవలు పాల్గొన్నారు.