calender_icon.png 13 February, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది

13-02-2025 01:08:29 AM

  • మార్సెయిల్‌లో వార్ మెమోరియల్‌ను సందర్శించిన ప్రధాని
  • ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత సైనికులకు నివాళులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఫ్రాన్స్ పర్యటలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి బు ధవారం మార్సెయిల్‌లో ఉన్న మజార్గ్యూస్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. రెం డు ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయి న భారత సైనికులకు ఈ సందర్భంగా ప్రధా ని నివాళులర్పించారు.

ఈ క్రమంలోనే వీర్ సావర్కర్‌ను స్మరించుకున్న మోదీ.. బ్రిటిషర్ల చెర నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నించిన తీరును కొనియాడారు. ఆ సమయంలో సావర్కర్‌ను బ్రిటీష్ కస్టడీకి అప్పగించవద్దని డిమాండ్ చేసి, ఆయనకు అండగా నిలిచిన మార్సెయిల్ ప్రజలు,  కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. 

నూతన కాన్సులేట్ ప్రారంభం

ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికలకు నివాళులర్పించిన అనంత రం ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లో ఏర్పాటు చేసిన భారత నూతన కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాన్సులేట్ కార్యాలయానికి చేరుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు అక్కడి భారత కమ్యూనిటీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ ప్రజలకు కరచాలనం చేసి ప్రజలతో కొద్ది సమయం ముచ్చటించారు. 

ప్రధాని విమానానికి ఉగ్ర బెదిరింపులు

ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని అమెరికా పర్యటనకు బయల్దేరే సమయం లో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు వచ్చాయి. ప్రధాని విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొ చ్చని తమకు సమాచారం వచ్చినట్టు ముం బై పోలీసులు వెల్లడించారు.

ఫిబ్రవరి 11న పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చినట్టు తెలిపిన అధికారులు.. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదు ల దాడి జరగొచ్చని అవతలి వ్యక్తి చెప్పినట్టు పేర్కొన్నారు. దీంతో వెంటనే దర్యాప్తు సంస్థలను అమ్రమత్తం చేసినట్టు వెల్లడించారు. కాల్ ఎవరు చేశారనే దానిపై కూడా విచారణ జరుపుతున్నట్టు వివరించారు. 

అమెరికా ఉపాధ్యక్షుడితో సమావేశం

పారిస్‌లో మంగళవారం జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భం గా జేడీ వాన్స్, ఉషాల కుమారుడు వివేక్ పుట్టిన రోజు వేడుల్లో ప్రధాని పాల్గొని.. ఆ చిన్నారికి బహుమతులు అందజేశారు.

అనంతరం ఇరువురు నేతలూ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు ఉపాధ్యక్షుడి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. యూఎస్ అణు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌కు చేకూరే లబ్ధిపై ఇరువురు నేతలూ చర్చించినట్టు ప్రకటనలో పేర్కొంది. 

అమెరికాకు పయనం

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధా ని నరేంద్రమోదీ చివరగా ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి కాడరాచేలోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పర్మెంటల్ రియాక్టర్(ఐటీఈఆర్)ను సం దర్శించారు. ఈ సందర్భంగా ఐటీఈఆర్ పురోగతిని గురించి అక్కడి అధికా రులను అడిగి తెలుసుకున్నారు.

కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యూజన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకటై న ఐటీఈఆర్‌ను దేశాధినేతలు సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశే షం. ఐటీఈఆర్ సందర్శన అనంతరం ప్రధాని మోదీ ఫ్రాన్స్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు అమెరికాకు బయల్దేరి వెళ్లారు.