అగ్ర హీరో అజిత్‌కుమార్ కథానాయకుడిగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విడాముయర్చి’. సీనియర్ నటుడు అర్జున్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. 2025 సంక్రాంతికి విడుదలవుతోందీ సినిమా. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఫాస్ట్ బీట్‌లో సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో ఈ పాటను ఆంథోని దాసన్ పాడగా, అరివు సాహిత్యం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్; ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్; ఆర్ట్ డైరెక్టర్: మిలాన్; స్టంట్స్: సుందర్.