16-04-2025 12:57:39 AM
నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చే అవకాశం
సిద్దిపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): వేసవికాలంలో అడవి జంతువులకు తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అయితే అటవీ ప్రాంతంలో నీటితోపాటు ఆహారం లభించక అవి అటవీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. జనావాసాలలోకి వచ్చిన జంతువులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుందని అటవీశాఖ ఆధ్వర్యంలో సాసర్ పీట్స్ ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు.
వన్యప్రాణులకు సరిపడా ఆహారం లేకపోయినప్పటికీ నిరంతరంగా తాగునీరు ఉంటే అవి బ్రతకటం సులభతరం, దాంతో తాగునీటి కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా ఉండేందుకు శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో 529 సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారు. మెదక్ ప్రాంతంలోని అభయారణ్యంలో 120 సాసర్ ఫిట్స్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ చిరుతపులులు అధిక సంఖ్యలో ఉంటాయి, అందుకే వాటికి ప్రత్యేకమైన కంచ నిర్మించి వాటి లోపల సాసర్ పిట్స్ ఏర్పాటు చేసి సోలార్ బావి బోర్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. వేసవికాలం ప్రత్యేక ప్రణాళిక ద్వారా అటవీ ప్రాంతంలోని జంతువులకు నీరు అందించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.
జంతువులకు ఆహారం నీటి సమస్య తలెత్తినప్పుడు అడవుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నీటి కోసం బయటకు వస్తా యి దాంతో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండ టం అవసరం.
కొన్ని నెలల క్రితం మెదక్ జిల్లా చేగుంట మండలంలో చిరుత పులి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తెలిసిందే కంచ నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనాలు ఢీకొట్టగా అత్యంత తీవ్రంగా గాయపడిన చిరుత పులి మృతి చెందింది.
ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు...
డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి జ్యోజి తెలిపారు. మెదక్, సిద్దిపే ట జిల్లాలలో నాన్ ప్లానింగ్ ద్వారా రూ.25 లక్షలు ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఈ రెండు జిల్లాలలో యాదృచ్ఛికంగానే భూగ ర్భ జలాలు అడుగంటిపోతాయని అందుకే 2024-25 సంవత్సరానికి గాను ఎనిమిది లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు.
సకాలంలో అటవీ ప్రాంతంలో జంతువుల కో సం సాసర్ ఫిట్స్ ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నాం. అవసరమైతే ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం అధికారులు సిబ్బందితో నీటిని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా జంతువులు అడవి నుంచి రోడ్డుపైకి కానీ గ్రామాలలో కానీ వచ్చినట్లయితే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.