15-03-2025 12:31:02 AM
ముఖ్య అతిధి గా తుమ్మల యుగంధర్
కల్లూరు, మార్చి 14 ( విజయ క్రాంతి ):- కల్లూరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యం బాబు జన్మదిన వేడుకలు శుక్రవారం కల్లూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏనుగు సత్యం బాబు తుమ్మల యుగంధర్ ని శాలువ తో సత్కరించారు. పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ని మర్యాదపూర్వం కలిశారు. ఈ సందర్భంగా సత్యం బాబుకి డాక్టర్ మట్ట దయానంద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, లక్కినేని కృష్ణ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు,పాపబత్తిని నగేష్,కె వి ఆర్,బత్తుల రాము, పెద్ద బోయిన శ్రీనివాసరావు,యాసా శ్రీకాంత్, నోటి కృష్ణా రెడ్డి,శివకుమార్ నాయక్, తోట సుబ్బారావు,మట్టా రామకృష్ణ,భైర్ల కాంతారావు,బొల్లేపోగు రవి,పసుపులేటి శ్రీనివాస రావు,రాచబోయిన శ్రీను, వంశీ నాయక్, భానోత్ పంతులు,కంభంపాటి పుల్లాచారి, నరుకుళ్ల సురేష్, పొన్నూరి వెంకటేశ్వర్లు మండల నాయకులు,గ్రామ నాయుకులు, కార్యకర్తలు తరితరులు పాల్గొన్నారు.