calender_icon.png 18 January, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో సాత్విక్ జోడీ

18-01-2025 12:42:55 AM

ఇండియా ఓపెన్ టోర్నీ

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ శెట్టి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్ జంట 21 21 జిన్ యోంగ్ మిన్ (కొరియా)ను చిత్తు చేసింది. కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆట కట్టించిన చిరాగ్ జోడీకి ఇది వరుసగా మూడో సెమీస్ కావడం విశేషం. గతేడాది చైనా మాస్టర్స్‌తో పాటు మలేషియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు, పరుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు.