షెంజెన్: భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ అదరగొడుతోంది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో సెమీస్‌కు చేరుకుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ జంట ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం విశేషం.
శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఈ జోడీ 21-16, 21-19 తేడా తో కిమ్-ఆండర్స్ (డెన్మార్క్) జోడీ మీద ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరు కేవలం 47 నిమిషాల్లోనే పూర్తుంది. గతేడాది కూడా ఈ టోర్నీలో సాత్విక్ జోడీ ఫైనల్‌కు చేరుకుంది.
క్వార్టర్స్‌లో ఓడిన లక్ష్యసేన్
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన లక్ష్యసేన్‌కు క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. లక్ష్య 18-21, 15-21 తేడాతో అండర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) మీద పోరాడి ఓడాడు. దీంతో అతడు ఉత్తి చేతులతోనే స్వదేశానికి పయనం కానున్నాడు.