మలేషియా ఓపెన్ టోర్నీ
కౌలాలంపూర్: భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మలేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో సె మీస్‌లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ 26-24, 21-15తో మలేషియాకు చెందిన యూ సిన్-యి టియో జంటను చిత్తు చేసిం ది. సెమీస్‌లో సాత్విక్ జంట గతేడాది రన్నరప్‌గా నిలిచిన వోన్ కిమ్-సుంగ్ సియో జో డీతో తలపడనుంది.
తొలి గేమ్‌లో చిరాగ్ ద్వయానికి గట్టి పోటీ ఇచ్చిన ప్రత్యర్థులు రెం డో గేమ్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా తేలిపోయారు. మలేషియన్ ఓపెన్‌లో ఈ జోడీ వరుసగా మూడోసారి సెమీస్ బెర్తు దక్కించుకుంది.