calender_icon.png 8 January, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేవరెట్‌గా సాత్విక్ జోడీ

07-01-2025 01:17:32 AM

నేటి నుంచి మలేషియా ఓపెన్

కౌలాలంపూర్: మలేషియా ఓపెన్  సూపర్ టోర్నమెంట్‌తో ఈ ఏడాది బ్యాడ్మింటన్ సీజన్ మొదలుకానుంది. ఈ టోర్నీలో ఆడేందుకు భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ శెట్టి జోడీ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గతేడాది మలే షియా ఓపెన్‌లో రన్నరప్‌కు పరిమితమైన ఈ జంట ఈసారి టైటిల్ కొట్టాలని భావిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ భారత్‌కు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.

చాన్నాళ్ల తర్వాత సయ్యద్ మోదీ అంతర్జాతీయ టైటిల్ దక్కించుకున్న లక్ష్యసేన్ కింగ్ కప్ అంతర్జాతీయ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. లక్ష్యతో పాటు హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రియా న్షు రజావత్ బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ, మహిళల డబుల్స్‌లో గాయత్రి ట్రిసా జాలీ, అశ్వినిలై జోడీలు, మిక్స్ డ్ డబుల్స్‌లో తనీషా కపిల్, సతీశ్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.