- క్వార్టర్స్‌లో భారత డబుల్స్ ద్వయం
- మలేషియా ఓపెన్
కౌలాలంపూర్: భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మలేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ 21-15, 21-15తో మలేషియా జంట అజిరిన్- వి కియోంగ్‌ను ఓడించారు. కేవలం 43 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీ ఆటకట్టించిన ఈ జోడీ ఆద్యంతం దూకుడు ప్రదర్శించారు.
క్వార్టర్స్‌లో ఈ జోడీ స్థానిక ఆటగాళ్లు యూ సింగ్- యి టియోను ఎదుర్కోనున్నారు. ఈ విజయం మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు ఓటములే ఎదుర య్యాయి. సింగిల్స్‌లో హెచ్ ఎస్ ప్రణయ్, మాళవిక బన్సోద్ పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో ప్రణయ్ 8-21, 21-15, 21-23తో లి ఫెంగ్ (చైనా) , మహిళల ప్రిక్వార్టర్స్‌లో మాళవిక 18-21, 11-21తో ఐదో సీడ్ హాన్ యూ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.
మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రిసా జాలీ జంట 21-15, 19-21, 19-21తో జియా ఫాన్- జాంగ్ షూ చేతిలో పరాజయం పాలయ్యింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీశా కాస్ట్రో-ధ్రువ్ కపిల, సతీశ్-ఆధ్య జోడీలకు నిరాశే ఎదురైంది. సాత్విక్ జోడీ మినహా మిగిలిన భారత ఆటగాళ్లు ఓటములతో ఇప్పటికే ఇంటిబాట పట్టారు.