సయ్యద్ మోదీ టోర్నీ
లక్నో: లక్నో వేదికగా జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తప్పుకున్నారు. సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో డబుల్స్ కేటగిరీలో తప్పకుండా టైటిల్ సాధిస్తారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.
చైనా మాస్టర్స్‌లో ఈ జోడీ సెమీస్‌లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ, మాన్సి సింగ్, నవ్య కందేరి.. పురుషుల సింగిల్స్‌లో సిద్ధార్థ్, సనీత్, సంజీవ్, మహిళల డబుల్స్‌లో కావ్య- రాధిక జోడీతో పాటు కనికా-భర్తీ పాల్ మెయిన్ గేమ్ డ్రాకు అర్హత సాధించారు.