బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్లు అదరగొట్టారు. సింగిల్స్‌లో మీరాబా లువాంగ్, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ శెట్టి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం ప్రిక్వార్టర్స్‌లో మీరాబా 21 22 డెన్మార్క్‌కు చెందిన మాడ్స్ క్రిస్టోఫెర్సెన్ను చిత్తు చేశాడు. 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన లువాంగ్‌కు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైది. అయినా కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మీరాబా.. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కునావత్ విదిత్సర్న్తో మిరాబా అమితుమీ తేల్చుకోను న్నాడు. ఇక డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌చిరాగ్ జోడీ 21 21 గ్జీ సావో వీ హాన్ జంటపై గెలుపొందింది. ఇక క్వార్టర్స్‌లో ఈ జంట జునైదీ ఆరిఫ్ కింగ్ (మలేషియా)తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో అష్మిత చలీహా పోరాటం ముగిసింది.