- లక్ష్యసేన్ ముందంజ
- అశ్విని జోడీకి రెండో ఓటమి
పారిస్: ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగం పురుషుల డబుల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత ద్వయం సాత్విక్ శెట్టి క్వార్టర్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో సాత్విక్ జంట ఆడాల్సిన రెండో మ్యాచ్ రద్దు అయింది. సోమవారం ఈ జంట జర్మనీ ద్వయం మార్క్ లమ్స్‌ఫస్ సీడెల్‌తో తలపడాల్సి ఉంది. అయితే మార్క్‌కు మోకాలి గాయం కావడంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే తొలి మ్యాచ్‌ను నెగ్గిన సాత్విక్‌చిరాగ్ జోడీ గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను నేడు ఆర్డియాంటో (ఇండోనేషియా)తో ఆడను న్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్ జోడీ చరిత్ర సృష్టించనుంది.
లక్ష్యసేన్ ముందంజ
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో దూసుకెళ్తున్నాడు. తొలిసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్న లక్ష్యసేన్ గ్రూప్ దశలో మరో విజయాన్ని అందుకున్నాడు. గ్రూప్ లక్ష్యసేన్ 21 21 జులియెన్ కర్రాగి (బెల్జియం)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. గ్రూప్‌లో భాగంగా లక్ష్యసేన్ తన చివరి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ రూపంలో కఠిన ప్రత్యర్థితో తలపడనున్నాడు. విజయంతో జోష్‌లో ఉన్న లక్ష్యసేన్‌కు ఒలింపిక్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. శనివారం లక్ష్యసేన్ తన తొలి మ్యాచ్‌ను కెవిన్ కోర్డన్ (గౌటెమలా)పై ఆడాడు. ఆ మ్యాచ్‌లో 21 22 లక్ష్యసేన్ తన ప్రత్యర్థిపై ఘన విజయం ధించాడు. అయితే ఆ విజయం చెల్లదని ఒలింపిక్ నిర్వాహకులు పేర్కొన్నారు. మ్యాచ్ తర్వాత కెవిన్ కొర్డాన్ మోచేతి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు.
నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో ఆటగాడు గాయంతో నిష్క్రమిస్తే వాళ్లు ఆడిన లేదా ఆడాల్సిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకోరు. ఈ క్రమంలోనే లక్ష్యసేన్ కొర్డాన్‌పై సాధించిన విజయాన్ని నిర్వాహకులు ఒలింపిక్ రికార్డుల నుంచి తొలగించారు. కెవిన్ వైదొలగడంతో గ్రూప్ ముగ్గురు మాత్రమే మిగిలారు. ఒక విజయం సాధించిన లక్ష్యసేన్‌కు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. జొనాథన్ క్రిస్టీపై గెలిస్తే లక్ష్యసేన్ ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇక మహిళల డబుల్స్‌లో అశ్విని జోడీ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.