నస్పూర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నస్పూర్ పట్టణ అధ్యక్షులుగా సత్రం రమేష్ ను సంస్థ గత ఎన్నికల జిల్లా ఇంచార్జ్ బద్దం లింగారెడ్డి గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి మరోసారి పట్టణ అధ్యక్షులుగా నియమించినందుకు సంస్థ గత ఎన్నికల ఇన్చార్జి బద్దం లింగారెడ్డి, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిలకు కృతజ్ఞతలు తెలిపారు. నస్పూర్ పట్టణంలో పార్టీని బలోపేతం చేస్తానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు.