హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డెక్కన్ బ్రాంచ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) నూతన (అభ్యంతర) అధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డా. కె.సతీశ్ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. గతనెల 28న పదవీ విరమణ చేసిన డా.దిబ్యేందు మజుందార్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఐడీఏ డెక్కన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని జింఖానాలో డా.సతీష్‌కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి డెక్కన్ బ్రాంచ్ అధ్యక్షుడు డా.నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి డా.ఎ. శ్రీకాంత్, ఖజానాచారి డా.ఫరీన్‌మిర్జా, మాజీ నేషనల్ అవార్డు విన్నింగ్ అధ్యక్షులు డా.వైఎస్ రెడ్డి, డా.ఆదిత్య సందీప్, డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కరుణాకర్, డా.మహేశ్, డా. కేవీ రమణారెడ్డి, డా.రవీం ద్ర, కార్యనిర్వాహక సభ్యులు డా.అర్జున్ యాదవ్, డా.శ్రీచరణ్‌రెడ్డి, డా.శృతి, డా.గీత, డా.సూర్య ప్రసన్న, డా.హరీశ్ తదితరులు హాజరయ్యారు. అలాగే అధ్యక్ష పదవి చేపట్టనున్న డా.సూర్య ప్రసన్న, డా.హుస్సేన్ అలీ ఖాన్, ఎడిటోరియల్ కమిటీ సభ్యులు సతీష్‌కుమార్‌రెడ్డిని సన్మానించారు.