calender_icon.png 14 March, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం కావాలి

08-02-2025 12:00:00 AM

  • మానవత్వం సాయితత్వం సేవలోనే సంతృప్తి
  • పసి హృదయంలో సంజీవని ప్రగతికి బాట సేవ, ఆరోగ్యం
  • ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

కొండపాక, ఫిబ్రవరి 7 : సత్యసాయి సేవా సంస్థలు అందిస్తున్న ఉచిత సేవలు విశ్వ వ్యాప్తం కావాలని ప్రముఖ క్రికెటర్ పద్మశ్రీ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. కొండ పాకలోని సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసర్చ్ ను శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆపరేషన్లు పూర్తి చేసుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు బహుమతులు అందజే శారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మానవత్వం సాయి తత్వం అని సిద్దిపేట రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో చిన్నారుల జీవితాల్లో వెలుగు లు నింపుతున్న డాక్టర్లను ఆయన అభినం దించారు. సిద్దిపేట ఆసుపత్రి సేవలు విశ్వవ్యాప్తం కావాలని ఆయన ఆకాం క్షించారు. ప్రతి ఒక్కరూ సేవా తత్వాన్ని అలవర్చుకోవాలని సేవలోనే సంతృప్తి ఉంటుందన్నారు.

తనతో పాటు తన కుటుంబం సాయి ఆశీస్సులు పొందిన వాళ్లమేనని ఎంతోమంది అభాగ్యులకు సాయి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నాడు చిన్నపిల్లల ఆపరేషన్లు ఎంతో క్రిటికల్ తో కూడుకున్నవని ఇక్కడ వారు ఇస్తున్న సేవలు ఎంతో గొప్పవని,ప్రేమ సేవ అందిస్తూ పిల్లలను అక్కున చేర్చుకుంటు న్నారని ఆయన ప్రశంసించారు.

గ్రామీణ ప్రాంతంలో ఎంత మంచి ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందించడం అభినందనీయమన్నారు. త్వరలో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తమవుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు స్వామి అనుగ్రహం తోనే ఇంత మంచి ఆసుపత్రి ఏర్పాటయిం దన్నారు.

ఆస్పత్రి చైర్మన్ శ్రీనివాస్ మాట్లా డుతూ మనమంతా నిమిత్త మాత్రులం సాక్షాత్తు ఆ దేవుడే మాతో ఈ పని చేపిస్తున్నాడు అని ఆయన పేర్కొన్నారు. మాకు ఆపరేషన్ పొందిన పిల్లలే మా దేవుడు లాంటి వారు ఇది ఒక దేవాలయం ప్రేమ సేవ అందిస్తూ మానవ సేవ సంస్థగా రూపొందిస్తామన్నారు.

పసి హృదయాల ను కాపాడుతూ భవిష్యత్తు తరాలను అందించే సంకల్పంతో ముందుకు వెళుతు న్నామన్నారు. సేవ ఆరోగ్యం ప్రగతికి బాటలు లాంటివి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాగిణి స్వర్ణ ఎన్ టి పి సి ప్రతినిధి పాణిగ్రహి ఇన్ఫోసిస్ ప్రతినిధి వంశీ కృష్ణ జగన్నాధ శర్మ తదితరులు పాల్గొన్నారు.

కలకత్తా మ్యాచ్ మర్చిపోలేనిది..

క్రికెట్ లైఫ్‌లో కలకత్తా మ్యా తనకు మరుపు రానిదని క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు ఆసుపత్రి సిబ్బందితో మాట కొద్దిసేపు మాట్లాడారు. తన కుటుంబం వైద్య వృత్తిపరమైనది కానీ తాను కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకొని 134 టెస్ట్ మ్యాచులు ఆడి ఎంతోమంది అభిమానం పొందానన్నారు.

తనకు సచిన్ అల్టిమేట్ టెండూల్కర్ రోల్ మోడల్ అని అన్నారు. వృత్తి ధర్మాన్ని బాధ్యతగా నిర్వర్తించిన వారే సెలబ్రేట్ అవుతారని పేర్కొన్నాడు.