calender_icon.png 20 April, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

09-04-2025 07:11:04 PM

పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ లో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే..

పెనుబల్లి (విజయక్రాంతి): మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. పెనుబల్లి హాస్పిటల్ లో ల్యాబ్, ఎక్స్ రే రూమ్, ఒపీ, ఇన్ పేషంట్స్, పెనుబల్లి హాస్పిటల్ శానిటేషన్, పెనుబల్లి హాస్పిటల్ రికార్డ్స్ పరిశీలించి, హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బందితో హాస్పిటల్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి కమిటీ సభ్యులు తో పలు సూచనలు, సలహాలు తెలుసుకున్నారు. 

మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ప్రస్తుత హాస్పిటల్ వివరాలు కమిటీకి తెలియజేసి, పెనుబల్లి ఆసుపత్రి లో గల సమస్యలు గురించి ఎమ్మెల్యే కి, డెవలప్మెంట్ కమిటీ కీ తెలియజేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... పెనుబల్లి ఆసుపత్రి పరిసరాలలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చెయ్యలి అని, ఆసుపత్రి బిల్డింగ్ మీద వున్న చెట్లు తొలిగించాలి అని, ఆసుపత్రి చుట్టూ గోడ నిర్మించాలి అని, వాటర్ ట్యాంక్ ఏర్పాటు గురించి, IO వాటర్ ప్లాంట్, ఆసుపత్రి చుట్టూ సోలార్ లైట్స్, సెక్యూరిటీ సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు, డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు, నూతన డాక్టర్స్ అవసరం గురించి కమిటీతో చర్చించి త్వరలో ఇవ్వన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు భట్టి, తుమ్మల, పొంగులేటి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజ నరసింహ సహకారంతో ఏర్పాటు చేసుకుందామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నది అని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షలు అందిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రతాప్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బుక్కా కృష్ణవేణి, లైన్స్ క్లబ్ అధ్యక్షులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, పెనుబల్లి వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.