03-04-2025 08:25:03 PM
కల్లూరు (విజయక్రాంతి): మెయిన్ రోడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రహరీ గోడ వద్ద సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వాల్ ఆఫ్ కైండ్‌నెస్ (దయ గల గోడ) ప్రారంభించారు. దంతాల సుధాకర్, అమర్లపుడి చక్రవర్తి దయార్ధ హృదయంతో ప్రజలు వారికి ఉపయోగపడని వస్తువులను ఇక్కడ ఇచ్చినట్లయితే పేద వారికీ ఉపయోగపడే వస్తువులు ఉచితంగా తీసుకుపోవచ్చు కాబట్టి మీ ఇంట్లో వుండే పుస్తకాలు, బట్టలు, స్టీల్ సామాన్లు, చెప్పులు, ఇతర వస్తువులు ఏవైనా ఇవ్వండి, లేని వారికీ ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ... వాల్ అఫ్ వాల్ ఆఫ్ కైండ్‌నెస్ సేవా నిర్వాహకులకు ఇటువంటి సేవా కార్యక్రమం పేద వారికోసం నిర్వహిస్తున్నందుకు వారికీ ధన్యవాదములు తెలిపారు. ప్రజలు కూడా రోజువారి జీవితంలో కాస్త సమయం సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఎంతోమంది పేద వారికీ సహాయం చేసినవారమవుతామని తెలిపారు. మీ ఇంట్లో మీకు ఉపయోగపడని వస్తువులు ఉంటే ఇక్కడ ఇచ్చి పధిమందికి అందించండి అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు తహసీల్దార్ పులి సంబశివుడు, ప్రభుత్వ వైద్యులు నవ్యకాంత్హెల్త్ సూపర్ వైజర్ రామ రావు, మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఆళ్లకుంట నరసింహారావు, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, యన్. యస్. యూ.ఐ నాయకులు పాల్గొన్నారు.