calender_icon.png 11 March, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహకారంతో సత్తుపల్లి అభివృద్ధి

11-03-2025 12:54:34 AM

అభివృద్ధి పనులకు వందల కోట్లు ఖర్చు 

త్వరలో  ౧౦౦ పడకల ఆస్పత్రి ప్రారంభం 

మీడియా సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్  మట్టా రాగమయి దయానంద్

సత్తుపల్లి, మార్చి 10 (విజయక్రాంతి): సీయం రేవంత్ రెడ్డి సహకారం తో సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ రాగమయి దయానంద్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమ వారం ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధిని వివరించారు.

వేంసూరు మండలం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రూ.240 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రూ.200 కోట్లు , యతలకుంట సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు రూ.15 కోట్లు,  రేజర్ల భూ నిర్వాసితులకు రూ.2 కోట్లు ఖర్చు చేయడంజరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ  సబ్ ప్లాన్ కింద  24 కోట్లు , ఈ జి ఎస్ రూ.30 కోట్లు ,  సి ఆర్ ఆర్ బిటి రోడ్లు 40 కోట్లు , ఎమ్ ఆర్ ఆర్ బిటి రోడ్లు కోసం రూ.15 కోట్లు , ఎస్డిఎఫ్  సీసీ రోడ్లుకు 10 కోట్లు , సి ఎస్ ఆర్  సీసీ రోడ్లు కొరకు 4 కోట్లు , డి ఎం ఎఫ్ టి   సీసీ రోడ్లుకు 22 కోట్లు ను కేటాయించామని తెలిపారు.

ఇందుకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇంతటి అభివృద్ధికి తోడ్పడిన  రాష్ట్ర ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్య మంత్రి భ ట్టి కి,  మంత్రి తుమ్మల నాగేశ్వరావు కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికీ ప్రత్యేక అభినందనలు తెలియ జేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో   కోటి మంది మహిళలను కోటిశ్వర్లుగా చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను తీసుకు వస్తున్నారని తెలిపారు.

ఎస్సీ,ఎస్టి సబ్ ప్లాన్ కింద 24కోట్లు మంజూరు అయ్యాయని,  విద్యపై ప్రత్యేక దృష్టి సారించి సింగరేణి ద్వారా రెండు కోట్లు నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన వంద పడకల హాస్పటల్ ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సింగరేణి ప్రభావిత ప్రాంతా బాధితులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.