calender_icon.png 18 March, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తుపల్లిలో కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ

18-03-2025 02:25:14 PM

సత్తుపల్లి పట్టణం,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 42%  బీసీ రిజెర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా రూ.6 వేలు కోట్ల నిధులు సహాయని రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు అందిస్తున్న సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. డా. మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్  ఆదేశాలు మేరకు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ, సత్తుపల్లి పట్టణం ఆధ్వర్యంలో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బాణా సంచా కాలుస్తూ, స్వీట్స్ పంచిపెడుతూ సంబరాలు నిర్వహించారు. 

ఆనాడు భారత్ జోడో యాత్రలో బీసీ రిజర్వేషన్ 42% ఇస్తానని జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు ప్రవేశ పెట్టటం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామి రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డా. మట్టా రాగమయి దయానంద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ  నాయకులు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం 5 మండలాల, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, 5 మండలాల యూత్ కాంగ్రెస్ నాయకులు, యన్. యస్. యు.ఐ నాయకులు పాల్గొన్నారు.