calender_icon.png 24 September, 2024 | 9:00 AM

సతీశ్‌కు అమెరికా ప్రెసిడెంట్ అవార్డు

24-09-2024 02:26:27 AM

అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ వాసి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణకు చెందిన  ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణుడు డా. సతీశ్ కత్తులకు అమెరికా ప్రెసిడెంట్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెం ట్ అవార్డు లభించింది. వాషింగ్టన్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును వాషింగ్టన్ సెనేట్ బిల్డింగ్‌లో సెనెటర్ జోయ్ మంచిన్ సతీష్‌కు అందించారు. ఆమెరికాను ఆరోగ్యవంతమైన దేశంగా మలిచే బృహత్తర కార్య క్రమంలో డా. సతీశ్ కత్తుల క్యాన్సర్ వైద్యనిపుణులుగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 29 ఏళ్లుగా ఆయన అమెరికాలో వైద్యునిగా సేవలందిస్తున్నారు.