13-02-2025 01:55:44 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి12: శాతవాహన విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్, ఓఎస్డి టు విసి హరికాంత్, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర పరిపాలన అధికారులతో కలిసి డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన బాధ్యతలు విస్తరించేందుకు అధ్యాపకులకు అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఇందులో భాగంగా వారి పేర్లను చేర్చడానికి డైరీని ఆలస్యంగా తీసుకువచ్చామని, శాతవాహన సామ్రాజ్య వ్యవస్థాపకుడు అయిన “సిముకా”శాతవాహన విగ్రహాన్ని త్వరలో విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జయంతి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డా. రంగప్రసాద్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీశైలం, అధ్యాపకులు డా. మనోహర్, డా. అబ్రరూల్ బకీ, ఆచార్య పురుషోత్తం, డా. సరసిజ, విజయ ప్రకాశ్, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.