కరీంనగర్: అఖిల భారత స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించారు. జిప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసి ఆప్టిట్యూడ్ టెస్ట్)లో శాతవాహన విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల విద్యార్థులు కళాశాల చరిత్రలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. శ్రీశైలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో మొత్తం 11 మంది విద్యార్థులు జి నందిని, వై స్నేహ, ఎ.రమ్య, ఎ.లోకేశ్, ఎం. సాయి కిరణ్, జి. ప్రత్యూష, పి. నవిత, డి. మేఘన, బి. పల్లవి, కె. శివాని, ఎం. ప్రవళిక, బి. మోహన్, సీహెచ్ చక్రధర్, ఎన్. శిరీష, ఎం. నితిన్, డి. విజయ్ మరియు కె. ప్రభాస్ అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఇంచార్జ్ ఉపకులపతి శ్రీ సురేంద్ర మోహన్ ఐఏఎస్, రిజిస్ట్రార్ డా. ఎం. వరప్రసాద్ విద్యార్థులను అభినందిస్తూ విశ్వవిద్యాలయ కళాశాల చరిత్రలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు. జి.ప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు దేశంలోని నైపర్ వంటి అత్యుత్తమ సంస్థలలో ఎం.ఫార్మసీ కోర్సులో ప్రవేశం లభిస్తుందని కోర్సు వ్యవధిలో కేంద్రవిద్య మంత్రిత్వ శాఖ నెలకు రూ.11 వేల ఉపకారవేతనం చెల్లిస్తుందని తెలిపారు. ఇట్టి విద్యార్థులకు పి.హెచ్.డిలో ఎంట్రన్స్ లేకుండా ప్రవేశం లభిస్తుందని పేర్కొన్నారు.