కరీంనగర్, జనవరి 30 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ పరిధిలో స్మార్ట్ సిటీ నిధుల కింద రోడ్డుతోపాటు ఎడమ వైపు నైట్ ఫుడ్ కోర్టులు, వాకర్స్ కు అనుకూ లంగా సాయం సమయంలో పిల్లలతో ఆహ్లాదంగా గడిపేందుకు అనువుగా నిర్మా ణం చేశారు. ఓపెన్ జిమ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతాలు నేడు మందుబాబులకు అడ్డాగా మారాయి.
ఉదయం వాకర్స్‌కు ఇబ్బంది లేకున్నా సాయంత్రం వాకర్స్ ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. శాతవాహన యూనివర్సిటీ గేట్లను అనుకుని నైట్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. దానిపక్కనే రామమం దిరం ఉంటుంది. మందిరం దాటి యూనివ ర్సిటీ మొదటి గేటు నుంచి వెటర్నరీ కళాశాల వరకు ఫుట్‌పాత్‌లను, యోగాకు అనుకూలంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
యోగా స్పాట్వద్ద ఉన్న గద్దెలపై రాత్రి మందుబా బులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు. తెల్లవారుజామున ఖాళీ బాటిళ్లు, కవర్లు ఈ ప్రాంతంలో దర్శనమిస్తున్నా పట్టించుకు నేవారు లేకుండా పోయారు. నైట్ ఫుడ్ కోర్టుల నుంచి ఆహారాన్ని తీసుకుని ఈ గద్దెలపై కూర్చుని మద్యంప్రియులు సేద తీరుతున్నారు.
రాత్రి సమయంలో ముఖ్యం గా ఫుడ్ కోర్టు నడుస్తున్న సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. శాతవాహ న విశ్వవిద్యాలయమే కాకుండా యూనివర్సి టీ నలువైపులా ఉన్న ఖాళీ స్థలాలు కూడా మందుబాబులకు అడ్డాలుగా మారాయి.
రేకుర్తి, ఆరెపల్లిలో విచ్చలవిడిగా బెల్టు షాపు లు రాత్రి వరకు కొనసాగుతుండడంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతాలలో కూ డా పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.