మహాదేవపూర్ (విజయక్రాంతి): దక్షణ కాశిగా పేరుపొందిన త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో శనివారం శత చండి మహా యాగం అంచల పురం వేద పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ దుద్దిల్ల మనోహర్ శర్మ ఆవధని ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తి శర్మ దంపతులు మహా రుద్రాభిషేకం సహస్త్రగటాభిషేకం నిర్వహించారు. అనంతరం అచలాపురం వేద పాఠశాల విద్యార్థులకే చండీ పారాయణం చేయడం జరిగింది.
నేడు జరిగే మహాకాత్రువు మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అలయ ఈవో మహేష్ తెలిపారు. మహా కుంభాభిషేకానికి నేడు రానున్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వీరితో పాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్య, రాష్ట్ర దేవాదాయ ధర్మా దాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఎస్పీ కిరణ్ కరే, పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు.