calender_icon.png 19 January, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేపీ నర్సింగరావు మృతి.. మాదిగ జాతికి తీరని లోటు

18-01-2025 11:42:01 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): కేపీ నర్సింగరావు మృతి మాదిగ జాతికి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ(Former Union Minister Sarvey Sathyanarayana) అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చినపుడే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బాగ్‌ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం(Sundarayya Vignana Kendram)లో అరుంధతీయ బంధు సేవా మండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరస్వామి అధ్యక్షతన అరుంధతీయ బంధు సేవా మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కేపీ నర్సింగరావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేపీ నర్సింగ్ రావు మాదిగల సంక్షేమానికి అహర్నిషలు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కేపీ నర్సింగ్ రావు, టీఎన్ సదాలక్ష్మమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సేన వ్యవస్థాపకులు జేబీ రాజు, ప్రొఫెసర్ ముత్తయ్య, సంగీతం రాజలింగం, భరత్ భూషణ్, నర్సింగరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.