calender_icon.png 11 February, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం

11-02-2025 10:50:29 AM

తిరుమల,(విజయక్రాంతి): తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనాకి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సోమవారం శ్రీవారిని 70,169 మంది భక్తులు దర్శించుకోగా, 24,559 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.33 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.