నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్(Sarva Shiksha Abhiyan) ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఆదివారానికి 21 రోజుకు చేరుకుంది. ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. దీక్ష శిబిరం వద్ద ఉద్యోగులు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు గంగాధర్, రాజరత్నం, హరీష్, అపర్ణ, లత, వీణరాణి, గీత, తదితరులు పాల్గొన్నారు.