నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ లో 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించి ప్రభుత్వ విద్యాశాఖలో విలీనం చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జుట్టు గజేందర్ అన్నారు. శనివారం నిర్మల్ లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత పేస్కేలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమున యాదవ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, గంగాధర పాల్గొన్నారు.