నిర్మల్,(విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరుతూ నిర్మల్ దీక్షా శిబిరంలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఒక క్రాఫ్ట్ టీచర్ ముఖ్యమంత్రి విగ్రహాన్ని తయారు చేయగా శుక్రవారం దిల్వార్పూర్ మండలం గుండపల్లి గ్రామం చెందిన సాయికుమార్ ముఖ్యమంత్రి చిత్రాన్ని వాటర్ పెయింట్ రూపంలో నాలుగు రోజులు కష్టపడి గీసి తమ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని కోరుతూ దీక్షాశిపురంలో ప్రదర్శించారు.
చాలీచాలని వేతనాలతో కాంటాక్ట్ పద్ధతి పై పని చేస్తున్న తమ సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎస్కేలు అమలు చేయాలని సాయికుమార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎస్టియు జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఆదురులో సంఘీభావం తెలిపి వారి పోరాటానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘం ఉంటుందని భరోసా ఇచ్చారు