calender_icon.png 28 December, 2024 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి

27-12-2024 08:33:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కన్వీనర్ కృష్ణారావు అన్నారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు 18 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కస్తూర్బా పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై నియమించినప్పటికీ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు భోజనం ఇతర అవసరాలు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.