calender_icon.png 22 December, 2024 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల వంటావార్పు

22-12-2024 05:22:00 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యా శాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 13 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు దీక్షా శిబిరము వద్ద వంటావార్పు నిర్వహించి రోడ్డుపై భోంచేసి తమ నిరసనలు తెలిపారు. 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం అధికారులు తమకు ఉద్యోగ భద్రత పేస్కేల్ పై హామీ ఇవ్వకపోవడం ఉద్యోగులపై చిన్న చూపు చూడడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, రాజరత్నం, హరీష్, అపర్ణ, లత, సుజాత, నవిత తదితరులు పాల్గొన్నారు.