calender_icon.png 25 April, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

25-04-2025 08:44:33 AM

తిరుమల,(విజయక్రాంతి): తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యేక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు శుక్రవారం ఉదయం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం 58,227 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని 28,951 మంది భక్తులు తలనీలాలు సమార్పించుకున్నారు. అలాగే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.