calender_icon.png 27 December, 2024 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారు.. సమయానికి రారు!

07-11-2024 12:50:04 AM

మంచిర్యాల మత్స్యశాఖ కార్యాలయంలో ఇష్టారాజ్యం

మంచిర్యాల, నవంబర్ 6 (విజయక్రాంతి): మంచిర్యాల కలెక్టరేట్‌లోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు తాళం వేస్తారో? ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కలెక్టర్ అమలు చేసినా జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది ఏమాత్రం పాటించడం లేదు.

ఇందుకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయమే ప్రత్యక్ష నిదర్శంగా చెప్పవచ్చు. బుధవారం కార్యాలయాన్ని సిబ్బంది ఉదయం 10.58 గంటలకు తాళం తీయడం దీనికి సాక్ష్యం. కలెక్టరేట్‌లో ఉండే కార్యాలయమే సమయపాలన పాటించకుంటే డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ ఇలాంటి అధికారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.