calender_icon.png 3 April, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

25-03-2025 01:38:41 AM

వనపర్తి, మార్చి 25 ( విజయక్రాంతి ) : సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం కొత్తకోట మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నీ కలిసి వినతి పత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్బంగా మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సర్పంచులతో పాటు..

కొత్తగా ఏర్పాటైన చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు..తాండాల గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లులు వచ్చేది ఉందని..పనులు చేయడానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెలించలేక సతమతమవుతు న్నారని.. ఆ బిల్లులు రాకపోతే వారికి ఆత్మహత్యలే శరణ్యమన్నారు..ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

సానుకూలoగా స్పందిoచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా జడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్,మాజీ జడ్పిటీసి పొగాకు విశ్వశ్వర్ ,మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్నకేశవ రెడ్డి,పూర్వ మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎద్దుల నగేష్, పరమేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.