29-03-2025 12:30:01 AM
పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఎంకి మాజీ సర్పంచులు పోస్టు కార్డు ద్వారా వినతి
రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్
మహబూబ్ నగర్ మార్చి 28 (విజయ క్రాంతి) : పెండింగ్ బిల్లులు అందజేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు పోస్ట్ కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి కోరుతున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ ఆధ్వర్యంలో జడ్చర్ల పోస్ట్ ఆఫీస్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని పోస్ట్ కార్డులు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, దేశంలోనే తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా 16 నెలలుగా సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మండల కార్యదర్శి రవీందర్ రెడ్డి, షంషీర్, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.