16-04-2025 01:44:33 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మేజర్ పంచాయతీకి ఐదేళ్లపాటు సర్పంచిగా బాధ్యతలు నిర్వహించిన దార్ల రామ్మూర్తి పదవీకాలం ముగిసిన తర్వాత జీవనోపాధి కోసం ఉపాధి పనులకు వెళుతు న్నాడు.
మేజర్ పంచాయతీ అందులో మండల కేంద్రం.. ఇనుగుర్తి కి ఐదేళ్లపాటు సర్పంచ్‌గా సేవలందించిన రామ్మూర్తి ఏడాదికాలంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో మళ్లీ రాజకీయంగా వెలుగు లోకి రావడానికి అవకాశాలు లేకపో వడం... సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి చేపట్టిన పనులకు బిల్లు లు చెల్లించకపోవడంతో, ఆర్థిక ఇబ్బందు లతో కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళ్తున్నట్లు చెప్పాడు