13-02-2025 06:10:35 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో గురువారం సరోజినీ నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ అధ్యక్షతన పాఠశాలలోని పసుపు రంగు సమూహము ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సరోజినీ నాయుడి చిత్రపటానికి పూలమాలంకారణ చేసి అంజలి ఘటించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలతో సరోజినీ నాయుడి చిత్రపటానికి ఘనంగా అంజలి ఘటించారు.
అనంతరం సరోజినీ నాయుడి దేవభక్తి, గుండె ధైర్యం, పట్టుదల వంటి ఎన్నో లక్షణాలను చక్కగా పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి.ఆర్.ఓ కాట్రగడ్డ మురళి కృష్ణ పిల్లలకు సరోజినీ నాయుడి దేశభక్తి గురించిన సందేశాన్ని పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కిడ్స్ ఇంచార్జ్ జి. కవిత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.