calender_icon.png 12 January, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోచింగ్ సెంటర్లపై సర్కారు నజర్

29-07-2024 02:02:31 AM

13 కోచింగ్ సెంటర్లు సీజ్

బేస్‌మెంట్‌లో క్లాసుల నిర్వహణపై చర్యలు 

అన్నీ ఓల్డ్ రాజీంద్రనగర్‌లో ఉన్నవే

రావ్స్ కోచింగ్ యజమాని అరెస్టు

న్యూఢిల్లీ, జూలై ౨౮: కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు సివిల్ సర్వీ సెస్ అభ్యర్థులు మరణించారని ఆరోపణలు వెల్లువెత్తటంతో పోలీసులు రంగంలోకి దిగా రు. ఓల్డ్ రాజీంద్రనగర్‌లో సెల్లార్లలో అక్రమం గా తరగతలు నిర్వహిస్తున్న ౧౩ కోచింగ్ సెంట ర్లను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. మరోవైపు ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మరణానికి కారణమైన రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తతోపాటు సంస్థ కో ఆర్డినేటర్ దేశ్‌పాల్‌సింగ్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ‘భారతీయ న్యాయ్ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 105, 106(1), 115(2), 290, 35 కింద రాజింద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ఇప్పటివరకు ఈ కేసపులో ఇద్దరిని అరెస్టు చేశాం’ అని పోలీస్ డిఫ్యూటీ కమిషనర్ ఎం హర్షవర్దన్ తెలిపారు. 

సెల్లార్‌లో అక్రమంగా లైబ్రరీ నిర్వహణ

సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు దేశం నలుమూలల నుంచి అభ్యర్థులు ఢిల్లీలోని వివిధ కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకొంటున్నారు. అందుకోసం ఒక్కొక్కరు లక్షల్లో ఫీజులు కడుతున్నారు. కోచింగ్ సెంటర్లలో రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌కు మం చి పేరున్నది. అయితే, అభ్యర్థుల తాకిడి ఎక్కువగా ఉండటంతో స్థల సరిపోక భవనం సెల్లా ర్‌లో అనుమతి లేకుండా లైబ్రరీని ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు.

ఇందులో 150 మంది విద్యార్థులు చదువుకొనేందుకు వీలున్నది. శనివారం రాత్రి అందులో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ భవనం కూడా రోడ్డు దిగువకు ఉన్నది. దీంతో భారీ వర్షాలతో మొదలైన వరద అత్యంత వేగంగా వచ్చింది. వరద ధాటికి సెల్లార్ తలుపులు కూడా బద్ధలయ్యాయి. ఒక్కసారిగా వరద రావటంతో విద్యార్థులంతా తప్పించుకోలేక కొందరు అందులోనే చిక్కుకుపోయారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్వాకం వల్లనే ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలు పోయాయని ఇతర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.  

అన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు

అనుమతులు లేని భవనాల్లో నిర్వహిస్తు న్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికా రులను ఆదేశించారు. నగరంలోని అన్ని కోచింగ్ సెంటర్లను తనికీ చేయాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ ఘటనపై రాజకీయం కూడా మొదలైంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ముగ్గురు విద్యార్థులు చనిపోయారని బీజేపీ నేతలు విమర్శించారు.  

ఇది వ్యవస్థ వైఫల్యం

విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన వ్యవస్థల మూకుమ్మడి వైఫల్యానికి అద్దం పడుతున్నదని పేర్కొన్నా రు. ప్రతి పౌరుడి రక్షణ ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. కోచింగ్ సెంటర్ ముందు భారీ సంఖ్యలో విద్యార్థులు ఆదివారం ధర్నా నిర్వహించారు. కోచింగ్‌సెంటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని శాంతపరిచే క్రమంలో ఢిల్లీ అదనపు డీసీపీ సచిన్ శర్మ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ‘ఈ ఘటనపై మీరు ఎంత బాధపడుతున్నారో నేనూ అంతే బాధపడుతున్నాను. ఎందుకంటే నేను మీలో భాగమే. నేనూ మీలాగే చదువుకొని వచ్చినవాడిని. ప్రతిదాన్నీ మనం ఎందుకు దాచాలి? చట్టప్రకారం ఏం చేయాలో అన్నీ చేస్తాం. దర్యాప్తు కొనసాగుతున్నది’ అని ప్రకటించారు.