calender_icon.png 20 September, 2024 | 12:59 PM

రైతుల చలో ప్రజాభవన్‌తో సర్కార్‌కు వణుకు

20-09-2024 01:45:32 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రుణమాఫీ కానీ రైతులందరూ సంఘ టితమై చలో ప్రజాభవన్‌కు పిలుపునిస్తే కాం గ్రెస్ ప్రభుత్వం వణికిపోతుందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల అరెస్టులను ఆయన  గురువారం ఒక  ప్రకటనలో ఖండించారు. రైతులను, రైతు సం ఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించి కక్షసాధింపులకు పాల్పడు తున్నారన్నారు.

బేషరతుగా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమది ఆంక్షలు లేని, కంచెలు లేని ప్రజాపాలన అంటూ డబ్బా కొట్టుకొనే రేవంత్‌రెడ్డి అణిచితేత ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. ప్రజాభవన్ చుట్టూ ఎందుకు బ్యారికేడ్లు పెట్టారని నిలదీశారు.  రైతుల ఉద్యమాన్ని ఎదుర్కొవడం చిల్లర కామెంట్లు చేసినంత సులువు కాదన్నారు. 

 ఖర్గేకు లేఖ.. 

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు  హరీశ్‌రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఆయన భాషపై హైకమాండ్ అభ్యంతరం చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ టెర్రరిస్ట్ అంటూ బీజేపీ చేసి న వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పెద్దలు.. కేసీఆర్‌పై రేవంత్ భాషను ఎందుకు కట్టడి చేయడం లేదన్నారు. రేవంత్ భాషను ప్రోత్సహిస్తున్న హైకమాండ్‌కు బీజేపీ వ్యాఖ్యలను ఖండించే నైతిక హక్కు కూడా లేదన్నారు.     అధిష్ఠానం మౌనం దురదృష్టకరమన్నారు.