calender_icon.png 24 October, 2024 | 3:47 AM

గంజాయి కట్టడిపై సర్కార్ నజర్!

24-10-2024 02:07:06 AM

  1. మాదక ద్రవ్యాల రాష్ట్ర రహితంగా తెలంగాణ 
  2. పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా కాకుండా ప్రత్యేక నిఘా 
  3. సమన్వయంతో మరింత దూకుడు పెంచేలా ప్లాన్ 
  4. ఏపీలో గంజాయి కట్టడికి ఉప సంఘం వేసిన సర్కార్  

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణను గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీజీ న్యాబ్, ఎక్సైజ్ శాఖ, పోలీస్‌తో పాటు నిఘా వ్యవస్థలు కలిసి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్‌పై దాడులు చేస్తున్నాయి.

క్వింటాళ్ల కొద్ది గంజాయి, కిలోల కొద్ది డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి జైల్లోకి నెట్టుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘాను పెంచారు. అయినా ఏదో ఒక మార్గంలో రాష్ట్రంలోకి గంజాయి సరఫరా అవుతోంది.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకోవడం, అందుకు మంత్రివర్గ ఉపసంఘం కూడా వేయడంతో తెలంగాణకు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు రవాణా కాకుండా మరింత కట్టడి చేయొచ్చనిచ్చినివచ్చని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

గంజాయి ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలు.. 

తెలంగాణలో గంజాయిసాగు, డ్రగ్స్ తయారీ కేంద్రాలు లేకున్నా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని అమ్మకాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు, గోవా, ఏపీ, ఒడిసా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా జరుగుతోంది. ఒడిసాలోని   మల్కన్‌గిరి ప్రాంతాల్లో గంజాయిని ఎక్కువగా సాగు చేస్తుంటారని, ఇక ఏపీలోని సీలేరు, శబరి, డొంకరాయి, దొరకొండ, మారెడుపల్లి, అరకు మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణకు రవాణా అయ్యే గంజాయి, డ్రగ్స్‌లో 80 శాతం ఒడిసా, 20 శాతం వరకు ఏపీ నుంచి వస్తోందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అంచనా వేసింది. శీలావతి అనే   గంజాయి రకానికి ఎక్కువగా డిమాండ్ ఉందని, ఈ రకం ఏపీలోనే ఎక్కువగా సాగవుతోందని డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తన నివేదికలో పొందుపర్చినట్లుగా సమాచారం. 

గంజాయి కట్టడికి ఏపీ నిర్ణయం..

గంజాయి, డ్రగ్స్ రవాణా కట్టడికి తెలంగాణ ప్రభుత్వమే కాకుండా ఏపీ కూడా కఠిన చర్యలు తీసుకుని సమన్వయంతో ముందుకెళ్తే గంజాయిని మరింత కట్టడి చేయడం చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.  తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక ని ఘా పెంచడం పెట్టడం, చెక్‌పోస్టులు ఏర్పా టు చేయడంతో పాటు సమన్వయంతో కలిసి దాడలు నిర్వహిస్తే గంజాయికి చరమగీతం పాడటానికి అవకా శం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఏపీతో పాటు ఒడిసా ప్రభుత్వ సహకారం కూడా తీసుకుం టే గంజాయి సాగు, రవాణాను అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభు త్వం గంజాయి కట్టడికి ఒక అడుగు ముందుకేసిందని, దీంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరింత ఊతమిచ్చినట్లుగా ఉందని అబ్కారీఅధికారులు చెబుతున్నారు.