బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): బడుగుబలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారి జీవితాలపై బుల్డోజర్లను పంపుతూ నిలువ నీడ లేకుండా చేస్తోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ పేదలు కాయకష్టం చేసి కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేసి వారిని దిక్కుతోచని స్థితికి నెడుతున్నారన్నారు. తెలంగాణలో హైడ్రా చర్యలతో పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులపై ప్రతీకారం తీర్చుకునేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు.