బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్,సెప్టెంబర్4(విజయ క్రాంతి): గురుకులాలను శిథిలం చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అంతర్జా తీయ స్థాయిలో నాణ్యమైన గురుకుల విద్యను అందించారని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తెలంగా ణ భవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుట్రలో ఎస్సీలు సమిధలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ గురుకులాల్లో 2 వేల మంది ఉపాధ్యాయులను రాత్రికిరాత్రే తొలగించ డంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజ్యా ంగ, చట్టబద్ధంగా, నిబంధనలకు లోబడి నియామకమైన వారిని తొలగించడమంటే నోట్లో మట్టి కొట్టడ మేనని పేర్కొన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గతంలో ఇంజినీర్లు, డాక్టర్లు అయితే ఇప్పుడు మళ్లీ పశువులు కాసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. వెయ్యి మంది డాక్టర్లను చేసిన గౌలిదొడ్డి గురుకులంలో ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పేద పిల్లల కోసం ఏర్పాటు చేసి క్రీడా అకాడమీలు మూతపడ్డాయని చెప్పారు. పేద విద్యార్థులంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు అంత కోపమని ప్రశ్నిం చారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.