calender_icon.png 27 October, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీలపై సర్కార్‌ది నిర్లక్ష్య వైఖరి

09-07-2024 01:11:09 AM

మాజీ మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలను అదానీ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం మైనా ర్టీలను అవమానపరచడమేనని మాజీ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు.  సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవం త్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమంపై నిర్లక్ష్య వహిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు 10 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవని, కేసీఆర్ పాలనలో 204 స్కూళ్లు ఏర్పాటు చేశారని, అవి కూడా జూనియర్, డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం మైనార్టీలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి, ఒక మం త్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమని, కేసీఆర్ మైనార్టీలకు హోం మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశా రు. పాతబస్తీతో శాంతిభద్రతలు అదుపు తప్పాయని,  కాంగ్రెస్ వచ్చిన తరువాత మత కలహాలు పెరిగిపోయా యని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తోందని, కమలం పార్టీతో సంబంధ మున్న చంద్రబాబుకు కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారని, రాహుల్ ఢిల్లీలో కొట్లాడుతుంటే రేవం త్ బీజేపీతో స్నేహం చేస్తున్నారని విమర్శించారు.