హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ పాన్ ఇండియా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ నెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ బుధవారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. కథానాయకుడు నాని మాట్లాడుతూ.. “నాపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని ఇంకా బలపరిచే సినిమా ‘సరిపోదా శనివారం’.
ప్రేక్షకులతో పాటు ఈ సినిమా చూడటానికి సుదర్శన్ 35 ఎంఎంకు మార్నింగ్ 11 గంటల షోకు వస్తున్నాను. వివేక్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. అతను రెండు నెలలుగా నిద్రపోయింది లేదు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ 24న జరగబోతోంది” అని తెలిపారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నానితో మేము చేసిన ’ఎంసీఏ’ పెద్ద హిట్టు. దాన్ని ’దసరా’ బీట్ చేసింది. ఇప్పుడు దాన్ని ’సరిపోదా శనివారం’ బీట్ చేయబోతోందని ట్రైలర్ చూసి నమ్మకంగా చెప్పొచ్చు‘ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్, నిర్మాత దానయ్య మాట్లాడి తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.